JP Nadda: దోచుకున్న ప్రతి రూపాయి తిరిగి కట్టాల్సిందే: రాహుల్‌పై నడ్డా విమర్శలు

ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల్లో కాంగ్రెస్‌ ఎంపీ నివాసంలో భారీగా నగదు గుర్తించడంపై జేపీ నడ్డా ఆ పార్టీపై విమర్శలు చేశారు.

Updated : 10 Dec 2023 16:42 IST

దిల్లీ: అవినీతికి కాంగ్రెస్ (Congress) హామీ ఇస్తే.. దానిని నియంత్రించేందుకు ప్రధాని మోదీ (PM Modi) చర్యలు తీసుకుంటారని భాజపా (BJP) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు భారీగా నగదు గుర్తించడంపై ఆయన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి రూపాయిని తిరిగి వసూలు చేస్తామని కరాఖండిగా చెప్పారు. 

‘‘మీతోపాటు (ధీరజ్‌ సాహు) మీ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా నవ భారతానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ రాజకుటుంబం పేరుతో చేసే దోపిడీని ప్రజలు అంగీకరించరు. చట్టం నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తి మీరు అలసిపోయుంటారు. కానీ, చట్టం మిమ్మల్ని వదలిపెట్టదు. అవినీతికి కాంగ్రెస్‌ హామీగా ఉంటే.. దానిని నియంత్రించేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటారు. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి రూపాయి తిరిగి కట్టాల్సిందే’’ అని నడ్డా ట్వీట్‌ చేశారు. 

రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. ఎవరంటే..?

మరోవైపు ధీరజ్‌ సాహు వ్యాపార లావాదేవీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టంచేసింది. ‘‘ధీరజ్‌ సాహు వ్యాపారాలతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆస్తులతోపాటు, తన నివాసంలో ఐటీ శాఖ అధికారులు పెద్ద మొత్తంలో గుర్తించిన నగదు గురించి సాహు మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉంది’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్ చేశారు. 

ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా ఒడిశాలోని రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు పెద్ద మొత్తంలో నగదు గుర్తించారు. ఇప్పటివరకు ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఒకే దాడిలో ఇంత పెద్ద మొత్తాన్ని గుర్తించడం ఇదే మొదటిసారని సంబంధిత అధికారులు తెలిపారు. అరవింద్‌ సాహు మద్యం వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహు నివాసంలో దాడులు చేసిన అధికారులు సుమారు రూ.300 కోట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో గుర్తించిన మొత్తం నగదు విలువ సుమారు రూ.500 కోట్లు పైన ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు