JP Nadda: కాంగ్రెస్‌ ఊత కర్రల సాయంతో నడుస్తోంది: జేపీ నడ్డా విమర్శలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 09 Jul 2024 20:01 IST

తిరువనంతపురం: కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలపై భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీల సిద్ధాంతాలకు కాలం చెల్లిపోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ (Congress)ని పరాన్నజీవి పార్టీగా పేర్కొన్న ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ప్రాంతీయ పార్టీల మద్దతు వల్లే కాంగ్రెస్‌ సీట్లు గెలుచుకుందని విమర్శించారు. కాంగ్రెస్‌ సొంతకాళ్లపై నిలబడలేదని.. ఊతకర్రల(క్రచెస్‌) పై నడుస్తోందని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులు కూడా తమ వారసత్వాన్ని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్‌ను అనుకరిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి కేరళకు వచ్చిన ఆయన తిరువనంతపురంలో భాజపా కార్యకర్తలు, మద్దతుదారులతో నిర్వహించిన సభలో మాట్లాడారు.  

పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు?: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

‘కొందరు భాజపాను ఉత్తర భారత పార్టీ అంటారు.. కానీ మనది ఆల్‌ ఇండియా పార్టీ.. దక్షిణ భారత రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో  దేశ ప్రజలు స్థిరత్వం, కొనసాగింపునకే ఓటేశారు. అందువల్లే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పార్టీల మద్దతుతో జాతీయ స్థాయిలో ఉనికి కలిగివుంది. ఆ పార్టీకి సొంతంగా స్ట్రైక్‌ రేట్‌చాలా తక్కువగా ఉంది. భాజపాపై నేరుగా పోటీ చేసిన 60కి పైగా స్థానాల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని