UP Polls: యోగీజీ అక్కడే ఉండండి.. మళ్లీ రావొద్దు: అఖిలేశ్ సెటైర్లు
వచ్చే నెలలో జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి బరిలో దించుతున్నట్టు భాజపా ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.......
లఖ్‌నవూ: వచ్చే నెలలో జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి బరిలో దించుతున్నట్టు భాజపా ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. యోగిని తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దించడం ద్వారా భాజపా అప్పుడే ఆయన్ను ఇంటికి పంపించేసిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో యోగిని మథుర, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ నుంచి బరిలో దించుతున్నట్టు చెప్పారనీ.. కానీ, ఇప్పుడు చూస్తే గోరఖ్‌పూర్ (సొంత ప్రాంతం)కు పంపడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. యోగి ఆదిత్యనాథ్ మార్చి 10 తర్వాత గోరఖ్‌పూర్ నుంచి లఖ్‌నవూ రావాల్సిన అవసరమే ఉండదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. అందుకే ఆయన అక్కడే ఉండిపోవాలనీ.. తిరిగి రావొద్దని సూచించారు. ఇకపై భాజపా ఎమ్మెల్యేలు, మంత్రుల్ని తమ పార్టీలో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు.
అయితే, త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీలో ఒక భాజపా నేత చేరబోతున్నారన్న అఖిలేశ్.. ఆ నేత ఎవరనేది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈసీ మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయానికి వచ్చినప్పుడల్లా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నిన్న తనను కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారని అఖిలేశ్ వెల్లడించారు. లోక్‌దళ్‌తో మాట్లాడి ఆయనకు ఘజియాబాద్, రాంపూర్ మణిహరన్ సీట్లు ఇచ్చినట్టు చెప్పారు. అయితే, ఇప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాక మళ్లీ వచ్చి తాను పోటీ చేయడంలేదని చెబుతున్నారన్నారు. ఆ ఫోన్ ఎవరిది? ఇందులో ఎవరి కుట్ర ఉంది అని ప్రశ్నించారు.
ఇటీవల భాజపాను వీడిన మంత్రి దారా సింగ్ చౌహాన్ గురించి విలేకర్లు ప్రశ్నించగా.. త్వరలోనే ఆయన పార్టీలో చేరబోతున్నట్టు అఖిలేశ్ వెల్లడించారు. యూపీ కేబినెట్ మంత్రి, ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో మంత్రి ధరమ్ సింగ్ షైనీతో కలిసి శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారితోపాటు ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు, అప్నాదళ్ (సోనేలాల్) ఎమ్మెల్యే అమర్‌సింగ్ చౌధరి కూడా అఖిలేశ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 403 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో కొనసాగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్‌పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.