తెరాస దాడులను నిరసిస్తూ దీక్ష: లక్ష్మణ్‌

తెరాస దాడులు, ఎస్‌ఈసీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్ష చేయనున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. మంగళవారం  ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపడుతానని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో సేదతీరేందుకు

Updated : 24 Sep 2022 14:41 IST

హైదరాబాద్‌: తెరాస దాడులు, ఎస్‌ఈసీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్ష చేయనున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. మంగళవారం  ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపడుతానని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో సేదతీరేందుకు వచ్చిన బండి సంజయ్‌ను తెరాస కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తెరాస కార్యకర్తలు బండి సంజయ్‌కు పార్టీ కేటాయించిన వాహనంపై చేతులతో దాడి చేయడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఈ ఘటనపై  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. తెరాస అనైతిక విలువలను పాటిస్తోందని, కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా గెలుస్తుందనే భయంతోనే తెరాస నేతలు  అల్లర్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసకు ఓటమి భయం పట్టుకుందని రాజాసింగ్‌ అన్నారు. భాజపా నేతలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని