Bhanu Prakash Reddy: తిరుమలలో ప్రతి పనికీ 10-15 శాతం కమీషన్లు

ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో పవిత్రమైన తిరుమలను ఆ పార్టీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 17 Jun 2024 04:25 IST

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో పవిత్రమైన తిరుమలను ఆ పార్టీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లోని ప్రతి పనిలోనూ ఆ బోర్డు మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సుమారు 10 నుంచి 15 శాతం కమీషన్లు వసూలు చేశారని మండిపడ్డారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘ప్రొటోకాల్‌ దర్శనం నుంచి ప్రసాదం టికెట్ల వరకు అన్నింట్లోనూ అవకతవకలు జరిగాయి. ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే ప్రక్షాళనకు తిరుమలనుంచే శ్రీకారం చుట్టింది. తిరుమలలో అరాచకాలపై న్యాయ విచారణ జరపాలి. దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న మాదిరిగానే రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపైనా త్వరలో విచారణ జరగనుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు మచ్చను భాజపాపై వేసేందుకు జగన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఈ చట్టం అమలవడం లేదు. జగన్‌ మళ్లీ ఓదార్పు యాత్ర చేస్తామని చెబుతున్నారు. ఆయన తీర్థయాత్రలు చేసుకోవటమే ఉత్తమం’ అని భానుప్రకాశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని