
ఏపీలో ఆలయాలపై దాడులు..జోక్యం చేసుకోండి
రాజ్యసభలో భాజపా నేత జీవీఎల్
న్యూదిల్లీ: ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కోరారు. ఏపీలో జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యమే వీటికి కారణమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులను సభతో పాటు దేశం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల జరిగిన ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత ఏడాదిన్నరగా ఏపీలో ఈ తరహా దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోవటమే దీనికి కారణం. ఈ ఘటనలు రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, ధర్మాచార్యులను బాధిస్తాయి’ అని జీవీఎల్ అన్నారు.
ఇవీ చదవండి..
‘ఈ-వాచ్’ యాప్ ఆవిష్కరించిన ఎస్‌ఈసీ
బెంగళూరులో యుద్ధవిమానాల విన్యాసాలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.