కరోనా విషయంలో ప్రభుత్వానిది నిర్లక్ష్యం: లక్ష్మణ్‌

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. హైకోర్టు చెప్పినా.. లెక్కచేయకుండా ప్రజల

Published : 22 Apr 2021 01:36 IST

హైదరాబాద్: కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. హైకోర్టు చెప్పినా.. లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్‌ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోందని ధ్వజమెత్తారు. వివిధ పార్టీలు ఇప్పటికే నగరపాలక ఎన్నికలను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయన్నారు. బాధ్యతాయుతంగా ఆలోచించి కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులపై వెంటనే స్పందించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని