TS News: నిబంధ‌న‌లు పాటించినా కేసులా?: విజయశాంతి

సిద్ధిపేట‌లో ప్ర‌జాస్వామ్యం ఉందా లేక నిరంకుశ రాజ్యం న‌డుస్తోందో అర్థం కావ‌డం లేద‌ని మాజీ

Published : 24 May 2021 01:51 IST

హైద‌రాబాద్‌: సిద్దిపేట‌లో ప్ర‌జాస్వామ్యం ఉందా లేక నిరంకుశ రాజ్యం న‌డుస్తోందా అర్థం కావ‌డం లేద‌ని మాజీ ఎంపీ, భాజ‌పా నేత విజ‌య‌శాంతి విమ‌ర్శించారు. స‌ర్కారు ఆస్ప‌త్రుల్లో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించ‌డానికి వెళ్లిన భాజపా మ‌హిళా మోర్చా నాయ‌కుల‌పై నాన్ బెయిల‌బుల్ కేసులు పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

 కొవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పీపీఈ కిట్లు వేసుకొని ఆస్ప‌త్రుల‌కు వెళ్లినా.. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్ట‌డం ఏంట‌ని విజయశాంతి నిలదీశారు. నిత్యం లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న ఎంత‌మందిపై కేసులు పెట్టి కోర్టు ముందు ప్ర‌వేశ పెడుతున్నారో చెప్పాల‌ని ప్రశ్నించారు. పీపీఈ కిట్ ధ‌రించ‌కుండా గాంధీ, ఎంజీఎంలో తిరిగిన సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టాల‌ని ఆమె వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని