BRS: మంత్రి కేటీఆర్‌ సమక్షంలో భారాసలో చేరిన భాజపా నేతలు

భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సమక్షంలో భాజపా నేత వెంకట్‌రెడ్డి దంపతులు భారాసలో చేరారు.

Published : 22 Sep 2023 15:34 IST

హైదరాబాద్‌: భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సమక్షంలో భాజపా నేత వెంకట్‌రెడ్డి దంపతులు శుక్రవారం భారాసలో చేరారు. భారతీయ జనతాపార్టీ గద్వాల్‌ జిల్లా ఇన్‌ఛార్జి వెంకటరెడ్డి, ఆయన సతీమణి బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌ కొర్పొరేటర్‌ పద్మా వెంకట్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. భాజపాకు రాజీనామా చేసిన అనంతరం భారాసలో చేరినట్టు ఈ సందర్భంగా వారు ప్రకటించారు

‘‘గత 40 ఏళ్లుగా పార్టీకి సేవలందించా. ఆ ఉద్దేశంతోనే అంబర్‌పేట అసెంబ్లీ టికెట్‌ ఆశించా.. కానీ, పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మనస్థాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా ఇప్పటికీ అవకాశం రాకపోతే ఎలా? కిషన్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నిస్తే సమయం ఇవ్వడం లేదు. మీరు పోటీ చేయకుంటే నేను పోటీ చేస్తానని కిషన్‌రెడ్డిని స్పష్టంగా అడిగితే పార్టీ నిర్ణయిస్తుందని దాటవేశారు’’ అ ని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని