Munugode: నవంబర్‌లోనే మునుగోడు ఉప ఎన్నిక.. సన్నద్ధతపై సునీల్‌ బన్సల్‌ సమీక్ష

మునుగోడు ఉప ఎన్నిక నవంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తెలిపారు. ఉప ఎన్నికకు ఇంకా 40 రోజులే ఉన్నందున ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్నారు.

Published : 02 Oct 2022 01:27 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై మరింత వేగం పెంచాలని కమలనాథులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక నవంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ఉండొచ్చని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తెలిపారు. ఉప ఎన్నికకు ఇంకా 40 రోజులే ఉన్నందున ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఆయన మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్‌ కమిటీ, పార్టీ  మండల అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో శనివారం సమావేశమయ్యారు. భాజపా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జిలు అక్కడే ఉండాలని సూచించారు. ఎప్పుడు ఏం చేయాలనే అంశాలపై మార్గనిర్దేశం చేశారు. మునుగోడు నోటిఫికేషన్‌కు ముందు తర్వాత ఏయే అంశాలపై దృష్టిసారించాలనే విషయాలపై పార్టీ నేతలకు వివరించారు. నియోజకవర్గంలో వాస్తవిక పరిస్థితులు, బూత్‌ స్థాయి కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాట్లపై చర్చించారు. మునుగోడులో పార్టీ బలం, తాజా పరిస్థితిని సునీల్‌ బన్సల్‌ దాదాపు అంచనా వేశారు. ఉప ఎన్నిక సన్నద్ధతపై ప్రత్యేకంగా సమీక్ష చేశారు. ఇప్పటి వరకు మునుగోడులో పార్టీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలు, వ్యూహాలపై ఆరా తీశారు. ఆయనకు అందిన సమాచారం ఆధారంగా ఎన్నిక వ్యూహాలను సిద్ధం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని