Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులుండవు.. ఒంటరిగానే బరిలోకి: కిషన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి.. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Updated : 15 Dec 2023 16:28 IST

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు (Loksabha Elections) సిద్ధం కావాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలంగాణకు రానున్నారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో కిషన్‌ రెడ్డి సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత భారత్, విశ్వకర్మ పథకాలపై సమావేశంలో చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

అనంతరం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే భాజపా పోటీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, భారాసతో సమాన పోరాటాలుంటాయి. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. తెలంగాణలో రాజకీయంగా భాజపాకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా ఫలితాలుంటాయి. శనివారం నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రంపై ప్రచారం మొదలు పెట్టాలి. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది’’ అని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని