BJP: వారిని భాజపాలో చేర్చుకోం: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

ఏపీ రాజధాని శిబిరాల వద్దకు భాజపా నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విచ్చేశారు.

Updated : 10 Jun 2024 18:59 IST

అమరావతి: ఏపీ రాజధాని శిబిరాల వద్దకు భాజపా నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విచ్చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు వేగంగా కొనసాగుతున్న వేళ ఆయన అక్కడికి చేరుకొని పరిశీలించారు. జగన్‌ ఓటమికి అమరావతి ఉద్యమం కూడా ఒక ముఖ్య కారణమని తెలిపారు. రాజధానిని తరలించాలని చూసిన జగన్‌కు జనం బుద్ధి చెప్పారన్నారు. వైకాపా త్వరలోనే భూస్థాపితం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భాజపాలో చేరాలని చూస్తున్నారని వెల్లడించారు. అయితే, వారిని భాజపాలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని