Andhra news: చెల్లితో రాజీ చేయాలని జగన్‌ తల్లిని కోరారు: భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

రాజంపేట వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి  భాజపాలో చేరేందుకు అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. 

Updated : 21 Jun 2024 19:19 IST

అమరావతి: రాజంపేట వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి భాజపాలో చేరేందుకు అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ‘‘భాజపా అంగీకరిస్తే అవినాష్‌రెడ్డి మినహా వైకాపా ఎంపీలంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, భాజపా నాయకత్వం వాళ్లు అక్కర్లేదని అంటోంది. అయినా.. మేం చేరతామంటూ మిథున్‌రెడ్డి ఇంకా లాబీయింగ్‌ చేస్తున్నారు. భాజపాలో చేరాలని ఆయన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్‌ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారు. చెల్లి వల్లే నష్టపోయామని జగన్‌ తెలుసుకున్నాడు. చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరాడు. అన్ననే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేసింది. త్వరలోనే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టవుతారు. కడప ఉప ఎన్నికల్లో భూపేశ్‌రెడ్డి తెదేపా తరఫున పోటీ చేసి గెలుస్తారు’’ అని ఆదినారాయణరెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని