Published : 24 May 2022 16:40 IST

Telangana News: ఇక్కడి రైతులను గాలికొదిలేసి పంజాబ్‌ రైతులకు సాయమా?: ఈటల

తుర్కపల్లి: రాష్ట్రమొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ప్రజలు ఆశించారని.. రాష్ట్రం వచ్చాక ప్రజల ఆశలు అడియాశలయ్యాయని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో పలు పార్టీల కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన ఈటల.. పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. జెండాలు, పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాడినట్లు చెప్పారు. అంత చేసినా కల్వకుంట్ల కుటుంబం తప్ప రాష్ట్ర ప్రజలు బాగుపడలేదని విమర్శించారు. అభివృద్ధి జరగలేదని చెప్పేందుకు తుర్కపల్లి మండలమే నిదర్శనమన్నారు. వరి పంట వేయొద్దని హుకుం జారీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని.. తరుగు పేరుతో రైతులను ఆగం చేస్తున్నారని ఆక్షేపించారు. దేశంలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది తెలంగాణలోనేనని వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలోని రైతులను గాలికి వదిలేసి పంజాబ్‌ రైతులకు సాయం చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల చావులు సీఎం కేసీఆర్‌కు పట్టవా?అని ప్రశ్నించారు. తెలంగాణలో రానున్న రోజుల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని