Eatala: కేంద్ర నిధులపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం: ఈటల రాజేందర్
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతోందని.. అందులో పాల్గొనేందుకు అధికారులు ముఖం చాటేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతోందని.. అందులో పాల్గొనేందుకు అధికారులు ముఖం చాటేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచులకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులే తప్ప మిగతా నిధులు రావడం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతో మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకుంటూ ఫలితం రాష్ట్ర ప్రభుత్వం పొందుతోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులపై సీఎం కేసీఆర్‌తో అయినా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో అయినా చర్చకు సిద్ధమని ఈటల అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు