- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Telangana News: అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరేది వీరే: ఈటల రాజేందర్
హైదరాబాద్: తెరాస సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, తెరాస నుంచి పెద్ద ఎత్తున భాజపాలో చేరికలు ఉంటాయన్నారు. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్‌తో పాటు మరికొంత మంది కాషాయ తీర్థం పుచ్చుకునే ఆస్కారం ఉందని తెలిపారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల పాఠశాలల వ్యవస్థ గొప్పగా ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ వందల సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. తిండిలేక, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు కేసీఆర్ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మనమడిని వారం రోజుల పాటు సంక్షేమ హాస్టల్లో ఉంచితే విద్యార్థులు పడే బాధ అర్థమవుతుందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు తీర్చాలని ఈటల డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ @ 14 ఇయర్స్.. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలయ్యా!
-
Politics News
Andhra news: రోజూ ఏదో ఒక కుట్ర: తెదేపాపై కొడాలి నాని ఫైర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల అప్పు
-
India News
Maharashtra: సముద్రతీరంలో ఆయుధాలతో పడవ గుర్తింపు.. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- Wipro: వేతనాల పెంపు ఆపట్లేదు.. 3 నెలలకోసారి ప్రమోషన్!