Raghunandan: డీజీపీ అంజనీకుమార్‌ను తక్షణమే ఏపీకి పంపాలి: భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌

ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు.

Published : 05 Feb 2023 13:57 IST

హైదరాబాద్‌: ఐపీఎస్‌ల పోస్టింగుల్లో తెలంగాణ అధికారులకు అన్యాయం జరిగిందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ మాట్లాడారు. 

ఏపీ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీ కుమార్‌ను తక్షణమే ఆ రాష్ట్రానికి పంపించాలని.. మిగతా ఐపీఎస్‌లకు న్యాయం చేయాలని రఘునందన్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్‌ల బదిలీల్లో నాలుగు కీలక పోస్టులను బిహార్‌ అధికారులు అంజనీకుమార్‌, సంజయ్‌కుమార్‌ జైన్‌, షానవాజ్‌ ఖాసిం, స్వాతిలక్రాకు కేటాయించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. భారాసకు ఎంఐఎం బీ టీమ్‌ అని రఘునందన్‌ ఆరోపించారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఐపీఎస్‌ బదిలీలపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శలు చేశారు. బిహార్‌కు చెందిన నలుగురు ఐపీఎస్‌లకు కీలక పోస్టులు కేటాయించారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని