Telangana News: శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యేలు సస్పెండ్‌

తెలంగాణ శాసనసభ నుంచి భాజపా సభ్యులను సస్పెండ్‌ చేశారు.

Updated : 07 Mar 2022 13:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ నుంచి భాజపా సభ్యులను సస్పెండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, రాజాసింగ్‌లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగానికి భాజపా సభ్యులు అడ్డుతగిలారని.. వారిని సస్పెండ్‌ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి ముగ్గురు భాజపా సభ్యులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.

మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన తర్వాత ఈటల రాజేందర్‌ తెరాసకు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. అనంతరం హుజూర్‌బాద్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలిచారు. కాగా భాజపా నుంచి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన తొలి రోజే ఈటల సస్పెండ్‌ కావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని