మేమే ప్రత్యామ్నాయం.. ఓట్లే నిదర్శనం

రాష్ట్రంలోని పట్టభద్రులు సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్..

Updated : 21 Mar 2021 05:08 IST

భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పట్టభద్రులు సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ‘నల్గొండ’ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని విభజించటంలో సీఎం‌ కేసీఆర్ విజయం సాధించారని విమర్శించారు. ఎన్నికల‌ కోడ్‌ను ఉల్లంఘించి సీఎం‌ కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారన్నారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయే అని చెప్పేందుకు తనకు వచ్చిన ఓట్లే నిదర్శనం అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీలను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించిందని.. మరింత కసిగా పనిచేసి 2023లో భాజపాను అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నైతికంగా తెరాస ఓడిపోయింది: ప్రేమేందర్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు, అక్రమాలు, అధికార దుర్వినియోగం మాత్రమే గెలిచిందని.. తెరాస నైతికంగా ఓడిపోయిందని ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత ఇది స్వల్ప విరామం మాత్రమే అని అన్నారు. ప్రతిపక్షాలు ఓట్లు చీల్చుకోవటం‌ కూడా తెరాస గెలుపునకు దోహదపడిందన్నారు. పల్లా దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచారని ఆరోపించారు.  ప్రజా సంక్షేమం కోసం భాజపా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు