Updated : 02 Nov 2021 19:50 IST

TS News: తెరాస పతనానికి నాంది పడింది: భాజపా ఎంపీ అర్వింద్‌

దిల్లీ: తెరాస పతనానికి నాంది పడిందని నిజామాబాద్‌ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెరాసలో పెద్ద ఎత్తున ముసలం పుట్టబోతోందన్నారు. హుజూరాబాద్‌లో భాజపాకు 20వేల మెజార్టీ వస్తుందన్న అర్వింద్‌.. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని భావించిన తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ‘‘కేసీఆర్‌ చేసిన అవినీతి పాపాలే ఆయన్ను చుట్టుముట్టాయి. అహంకారమే ఆయన్ను దహించివేసింది. కేసీఆర్‌ చరిత్రలో మిగిలిపోయే రోజు ఇవాళ్టి నుంచి మొదలైంది. తెరాస పార్టీ అస్తవ్యస్తం కాబోతోంది. తెలంగాణ ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి అతి త్వరలో రాబోతున్నారు. నిజమైన బంగారు తెలంగాణ అన్నది కేవలం నరేంద్రమోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం’’ అని అర్వింద్‌ అన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని