Karnataka: మహిళతో భాజపా ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!
కర్ణాటక(Karnataka)లోని కోలార్(Kolar) జిల్లాలో షాపింగ్ మార్కెట్‌ను భాజపా ఎంపీ మునిస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్లోని ఓ దుకాణంలో ఉన్న మహిళతో అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి.
బెంగళూరు: మహిళాదినోత్సవం (Women's Day) నాడు భాజపా (BJP) ఎంపీ ఒకరు ఓ మహిళతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించిన ఎంపీ, నీ భర్త బతికే ఉన్నాడుగా అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఎంపీ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. మహిళాదినోత్సవం నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
కర్ణాటక(Karnataka)లోని కోలార్(Kolar) జిల్లాలో షాపింగ్ మార్కెట్‌ను భాజపా ఎంపీ మునిస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని దుకాణాలను పరిశీలిస్తున్న ఆయన ఓ వస్త్ర దుకాణంలోని మహిళను చూసి ‘‘నీ పేరేంటి? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ స్టాల్‌కు వైష్ణవి అని పేరు పెట్టి, బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ భర్త బతికే ఉన్నాడా?’’ అని ప్రశ్నించారు. ఈ సంభాషణను మొత్తం అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో (Social Media) పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను కర్ణాటక కాంగ్రెస్ (Congress) ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. భాజపా మహిళా వ్యతిరేక విధానానికి ఇది నిదర్శనం. వారి వేషధారణ ఎలా ఉండాలని చెప్పే హక్కు భాజపా ఎక్కడిది? మహిళాదినోత్సవం రోజున ఆడవాళ్లను అవమానిస్తారా? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Mummified Body: తల్లి మృతదేహాన్ని భద్రపరచి.. 13ఏళ్లుగా సోఫాలోనే ఉంచి..!
-
Sports News
Virat Kohli : చేతికి స్టిచ్చెస్తో ఆడి.. అద్భుత సెంచరీ బాది.. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ గుర్తు చేసిన మాజీ ఆటగాడు
-
India News
Cheetha: నాలుగు కూనలకు జన్మనిచ్చిన నమీబియన్ చీతా
-
Movies News
Social Look: భర్తతో కాజల్ స్టిల్.. నేహాశర్మ రీడింగ్.. నుపుర్ ‘వర్క్ అండ్ ప్లే’!
-
India News
ఉద్యోగ పరీక్షలో కుందేలు-తాబేలు ఘటన.. రేసులో ముందున్నానని నిద్రపోయి..
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ లొంగిపోనున్నాడా..?