Updated : 25 May 2022 12:07 IST

GVL: వైకాపాకు ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేడ్కర్‌ పేరు పెట్టొచ్చుగా?: జీవీఎల్‌

విజయవాడ: వైకాపాకు ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేడ్కర్‌ పేరు పెట్టొచ్చుగా అని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నించారు. కోనసీమలో నిన్న జరిగిన హింసను ఖండిస్తున్నట్లు చెప్పారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కలిసి జీవీఎల్‌ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘‘కోనసీమ ఆందోళనలో భాజపా నేతలెవరూ పాల్గొనలేదు. అంబేడ్కర్‌ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి లాగింది. దేశ, రాష్ట్ర ప్రజలకు జగన్‌ క్షమాపణ చెప్పాలి. ఏపీలో శాంతిభద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. జిన్నా టవర్స్‌ పేరు మార్చాలని కోరితే మా నేతలను అరెస్టు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలు వీడకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తాం’’ అని జీవీఎల్‌ అన్నారు.

ఇది ప్రభుత్వ పన్నాగం: సత్యకుమార్‌

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ..‘‘కోనసీమలో హింస.. ప్రణాళిక ప్రకారమే జరిగిందని భావిస్తున్నాం. ఓ మంత్రికే ఇలా జరిగిందంటే ఏపీలో పరిస్థితి అర్థమవుతోంది. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రభుత్వ పన్నాగంగా భావిస్తున్నాం. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉంది. వైకాపా నేతల్లో కొందరు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్‌ స్పష్టం చేశారు. విశ్వరూప్‌ వ్యాఖ్యలు చూస్తే అధికార పార్టీ హస్తం ఉందని అర్థమవుతోంది. 7 నియోజకవర్గాల జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టి ఆ జిల్లాకే పరిమితం చేస్తారా? సీఎం జగన్‌ దావోస్‌ వెళ్లినా ఒక్క పైసా పెట్టుబడి కూడా ప్రత్యేకంగా రాలేదు’’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని