Vizag: విశాఖలో భూ దోపిడీపై వైకాపా, తెదేపా చర్చకు రావాలి: జీవీఎల్‌ సవాల్‌

పోలవరం ప్రాజెక్టు మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని చెప్పారు.

Published : 02 Dec 2022 19:46 IST

విశాఖపట్నం: వైకాపా, భాజపా మధ్య రాజ్యాంగబద్ధ సంబంధాలే ఉన్నాయని.. అంతకుమించి ఏమీ లేదని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు స్పష్టం చేశారు. వైకాపాకు భవిష్యత్తులో ప్రత్యామ్నాయం అవ్వాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. విశాఖలోని భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా భాజపా, జనసేనలే నిలబడతాయని చెప్పారు. పోలవరం మాదంటే మాది అని రెండు ప్రధాన పార్టీలు ప్రగల్భాలు పలకుతున్నాయని,  పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.  

విశాఖలో భారీగా భూములు దోచేస్తున్నారని జీవీఎల్‌ ఆరోపించారు. దీనిపై వైకాపా, తెదేపా నేతలు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా కుంటుపడ్డాయని.. రిజర్వాయర్లకు కనీస మరమ్మతులు జరగలేదన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి విశాఖకు 5జీ సేవలు వస్తాయని వెల్లడించారు. విశాఖ నుంచి 3 వందే భారత్ రైళ్లు నడుపుతామని తెలిపారు.  విశాఖ నుంచి తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరుకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నిర్వహణ ఖర్చులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థే ఖర్చు పెట్టిందని తెలిపారు. దీనికి కూడా ఎవరైనా స్టిక్కర్‌ వేసుకుంటే అది కచ్చితంగా దుస్సాహసమే అవుతుందని జీవీఎల్ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు