GVL: రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దు: భాజపా ఎంపీ జీవీఎల్‌

తెదేపాను దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పరిధిలోని తుళ్లూరు రైతులతో ఆయన సమావేశమయ్యారు.

Updated : 14 May 2022 15:26 IST

అమరావతి: తెదేపాను దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తుళ్లూరు రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైకాపా యత్నిస్తోందని చెప్పారు. రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దన్నారు.

హైకోర్టు తీర్పు తర్వాత కూడా మూడు రాజధానులు అనడం తప్పని..ఆ తీర్పును ధిక్కరించేలా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని తమ పార్టీ తీర్మానం చేసి చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా.. మూడు రాజధానులు లాంటి వేరే ప్రస్తావన చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసే సత్తా ఉంటే ఎందుకు చేయలేదని జీవీఎల్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా మొండివైఖరిని విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని