MP Laxman: తెదేపాతో పొత్తు ఆలోచన లేదు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని భాజపా ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు.

Published : 30 Sep 2022 13:50 IST

హైదరాబాద్‌: తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని భాజపా ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భాజపా క్లీన్‌స్వీప్‌ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగడం లేదని.. భాజపా రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 

ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతుందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. తెదేపాతో పొత్తుపై ఆలోచన లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించడమే కేంద్రమంత్రి పదవిగా భావిస్తున్నట్లు తెలిపారు.  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన రెండో వ్యక్తిని తానేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని