BJP: ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్‌ దూరంగా ఉండటం సరికాదు: లక్ష్మణ్‌

ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం తెరాస నేతలు స్వాగతించడం లేదని భాజపా ఎంపీ, సీనియర్‌ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు.

Updated : 11 Nov 2022 15:00 IST

హైదరాబాద్‌: ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణలో మాత్రం తెరాస నేతలు స్వాగతించడం లేదని భాజపా ఎంపీ, సీనియర్‌ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉంటున్నారని.. ఇది సబబు కాదన్నారు. రాజకీయాలు, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను సీఎం గుర్తించడం లేదని ఆక్షేపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. 

రాజకీయాలకు అతీతంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరవ్వాలని లక్ష్మణ్‌ కోరారు. దగ్గరుండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మోదీని అడగాల్సిందిపోయి కార్యక్రమాలకు రాకుండా ఉండటం సరికాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్నా మోదీ అభివృద్ధి పనులను చేపడుతున్నారని.. ఆయన పర్యటనను అడ్డుకుంటామని కొంతమంది పేర్కొనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని