Published : 23 May 2022 01:38 IST

Arjun singh: తృణమూల్‌ గూటికి చేరిన భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్‌

మూడేళ్ల తర్వాత తిరిగి సొంతపార్టీలోకి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ముందు పార్టీలు మారిన వారిలో కొందరు నేతలు మళ్లీ తమ పూర్వ పార్టీవైపు చూస్తున్నారు. భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, ఎంపీ అర్జున్‌ సింగ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఇటీవలే బాబుల్‌ సుప్రియో భాజపాను వీడి తృణమూల్‌లో చేరగా.. అదే దారిలో తాజాగా అర్జున్‌ సింగ్‌ వెళ్లారు. తాజా పరిణామంతో పశ్చిమబెంగాల్‌లో భాజపా ఎంపీల బలం 18 నుంచి 16కు తగ్గింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అర్జున్‌ సింగ్‌.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం బారక్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అయితే, మూడేళ్లపాటు భాజపాలో కొనసాగిన ఆయన.. పార్టీ తనను సరిగా పని చేసుకోనివ్వడం లేదంటూ ఇటీవల ఆరోపణలు మొదలుపెట్టారు. ముఖ్యంగా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ  సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ భాజపా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోన్న సమయంలోనే అర్జున్‌ సింగ్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీని వీడిన అర్జున్‌ సింగ్‌ మళ్లీ సొంత గూటికి చేరినప్పటికీ ఆయన కుమారుడు పవన్‌ సింగ్‌ మాత్రం భాజపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. తండ్రి పార్టీ మారడంతో కుమారుడు కూడా అదే దారిలో పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రాష్ట్రంలో భాజపా, తృణమూల్‌ పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తోన్న సమయంలో భాజపా ఎంపీలు తిరిగి తృణమూల్‌లోకి రావడం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు కనిపిస్తోంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని