Political news: ‘ఓబీసీలకు హక్కులు ఇవ్వడం భాజపాకు ఇష్టం లేదు’

ఈ దఫా జనగణనలో ఓబీసీ లెక్కలను సేకరించడం సాధ్యం కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ శనివారం భాజపాపై మండిపడ్డారు. ఓబీసీలకు జనాభా ప్రకారం హక్కులను...

Published : 26 Sep 2021 01:46 IST

దిల్లీ: ఈ దఫా జనగణనలో ఓబీసీ లెక్కలను సేకరించడం సాధ్యం కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ శనివారం భాజపాపై మండిపడ్డారు. ఓబీసీలకు జనాభా ప్రకారం హక్కులను ఇచ్చేందుకు ఆ పార్టీ అనుకూలంగా లేదని ట్వీటర్‌ వేదికగా ఆరోపించారు. ‘ఈ దీర్ఘకాలిక డిమాండ్‌ను తిరస్కరించడం ద్వారా.. తమకు ఓబీసీల జనాభాను లెక్కించడం ఇష్టం లేదని భాజపా ప్రభుత్వం నిరూపించింది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు హక్కులు ఇవ్వడం ఆ పార్టీకి ఇష్టం లేదు. డబ్బు, అధికారానికే మద్దతు ఇస్తున్న భాజపా.. మొదటి నుంచే సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తోంది’ అని ఆరోపించారు.

33 సీనియర్‌ నేతలకు తేజస్వీ యాదవ్‌ లేఖలు

మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్‌ శనివారం ఓబీసీల లెక్కింపు డిమాండ్ గురించి దేశంలోని 33 మంది సీనియర్ నాయకులకు లేఖలు రాశారు. ఈ డిమాండ్‌ను దేశ నిర్మాణంలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా చూడాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొన్నారు. ఓబీసీల గణనకు ఇదే చారిత్రక అవకాశం అని, అత్యవసరంగా పరిష్కారించాల్సిన అనేక సమస్యలను ఇది తెరపైకి తెస్తుందని వివరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని