Telangana News: భాజపాలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి?

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు....

Published : 29 Jun 2022 13:53 IST

హైదరాబాద్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు దాదాపు గంటపాటు సమావేశం అయ్యారు. కాగా, జూలై 1వ తేదీన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భాజపాలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. భాజపాలో చేరడంపై విశ్వేశ్వర్‌రెడ్డికి ఉన్న సందేహాలను భాజపా నేతలు నివృత్తి చేసి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని