Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల

ఈశాన్య రాష్ట్రం త్రిపుర (Tripura)లో అధికారం నిలబెట్టుకునేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రిని బరిలోకి దించింది.

Updated : 28 Jan 2023 18:27 IST

దిల్లీ: ఈశాన్య రాష్ట్రం త్రిపుర (Tripura)లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. తాజాగా అధికార భాజపా (BJP).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌ను ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ బరిలోకి దింపింది.

త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 48 అభ్యర్థులతో భాజపా తొలి జాబితా శనివారం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా (Manik Saha).. టౌన్‌ బోర్దోవాలి నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ (Pratima Bhoumik)‌.. అసెంబ్లీ ఎన్నికల్లో ధన్‌పుర్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు భాజపా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె త్రిపుర నుంచి ఎంపీగా ఉన్నారు. మిగతా 12 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు భాజపా వెల్లడించింది.

త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలను వెల్లడించనున్నారు. 2018లో భాజపా-ఐపీఎఫ్‌టీ సంయుక్తంగా పోటీ చేసి 43 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని