
Rajasthan: రాజస్థాన్‌లో హింసాత్మక ఘటనలకు ఆ రెండే కారణం! సీఎం గహ్లోత్ ఆరోపణలు
జైపూర్: రాజస్థాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల విషయమై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గురువారం భాజపా, ఆరెస్సెస్‌లపై మండిపడ్డారు. ఈ రెండూ.. రాష్ట్రంలో హింసను ప్రేరేపించాయని ఆరోపించారు. ‘ఆరెస్సెస్, భాజపా.. ఓ అజెండాను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరౌలి, జోధ్‌పూర్, రామ్‌గఢ్‌లలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు పథకం వేశాయి. అధికారులు సకాలంలో స్పందించి, తగు చర్యలు తీసుకోవడంతో.. చెదురుముదురు ఘటనలకే పరిమితమయ్యాయి. వీటితో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేశాం. హింసను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించబోం’ అని ఓ వార్తాసంస్థతో అన్నారు. రాష్ట్రంలో అల్లర్ల విషయమై గహ్లోత్ గతంలోనూ భాజపాపై విరుచుకుపడ్డారు. కరౌలిలో జరిగినదంతా భాజపా పన్నిన కుట్రేనని.. రామనవమి సందర్భంగా ఏడు రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా చేసినట్లు ఆరోపించారు.
ఇటీవల రంజాన్ వేళ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు ఏప్రిల్ 2న ఇక్కడి కరౌలీ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. హిందూ కొత్త సంవత్సరాదిని పురస్కరించుకొని నిర్వహిస్తోన్న మోటార్ సైకిళ్ల ర్యాలీపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. అనంతరం చెలరేగిన ఘర్షణల్లో కొందరు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. రామ్గఢ్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. రామనవమి, హనుమాన్జయంతి సందర్భంగానూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: బండ్ల గణేశ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ... ఏం చర్చించారంటే?
-
Politics News
Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
-
General News
JEE Mians: చుక్కలు చూపిస్తున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు..
-
Business News
Card tokenisation: కార్డు టోకనైజేషన్ గడువు మళ్లీ పొడిగింపు
-
Politics News
Maharashtra Crisis: ఏ జాతీయ పార్టీ మాతో టచ్‌లో లేదు: ఏక్నాథ్ శిందే ‘యూ టర్న్’!
-
General News
Covid Update: తెలంగాణలో కరోనా ఉద్ధృతి... ఒక్కరోజే 493 కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- Andhra News: అయ్యో పాపం.. బైక్‌పై వెళ్తుండగా అన్నదమ్ముల సజీవదహనం
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!