Rahul Gandhi: భాజపా, ఆరెస్సెస్‌లు కోరుకొంటున్నట్టు అదెప్పటికీ జరగదు: రాహుల్‌

ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా రాయ్‌పూర్‌లోని సైన్స్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాహుల్‌ సందర్శించారు. అక్కడ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లతో .....

Published : 04 Feb 2022 01:56 IST

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా, ఆ పార్టీ సిద్ధాంతం భారతదేశాన్ని ప్రమాదంలోకి నెడుతోందన్నారు. భాజపా, దాని సైద్ధాంతిక మార్గదర్శి ఆరెస్సెస్‌లు కేవలం ఒకే ఒక్క సిద్ధాంతంతో భారతదేశాన్ని పాలించాలని కోరుకుంటున్నాయనీ.. అది ఎప్పటికీ జరగదన్నారు. గురువారం ఆయన ఛత్తీస్‌గఢ్‌లో రాజీవ్‌ గాంధీ గ్రామీణ్‌ భూమిహీన్‌ కృషి మజ్దూర్‌ న్యాయ్‌ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. భాజపా, ఆ పార్టీ సిద్ధాంతం దేశాన్ని ప్రమాదం వైపు నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. గత 70 ఏళ్లలో ఏం చేశారంటూ భాజపా నేతలు ప్రశ్నించడం కాంగ్రెస్‌ను అవమానించడమే కాదు.. దేశ రైతాంగాన్ని, కార్మికులను అవమానపరచడమేనన్నారు. భారతదేశం భిన్న సిద్ధాంతాలు, సంస్కృతులు, భాషలకు నిలయమన్నారు. నిజమైన హిందుస్థాన్‌ అంటే ఏమిటో భాజపాకు తాము చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు. 

ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా రాయ్‌పూర్‌లోని సైన్స్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాహుల్‌ సందర్శించారు. అక్కడ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లతో పాటు ఇతర స్టాల్స్‌ని పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలతో కలిసి కాఫీ తాగిన రాహుల్‌.. బస్తర్‌ కాఫీని ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌గా మార్చాలన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని