Mamata: భాజపా పాలన హిట్లర్‌, ముస్సోలిని కన్నా దారుణంగా ఉంది: మమత

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని.....

Published : 23 May 2022 19:37 IST

కోల్‌కతా: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో సమాఖ్య నిర్మాణాన్ని కూల్చివేస్తోందన్నారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాషాయ పార్టీ పాలన అడోల్ఫ్‌ హిట్లర్‌, జోసెఫ్‌ స్టాలిన్‌ లేదా బెనిటో ముస్సోలిని కన్నా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేసేలా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని