BJP: భాజపా బలోపేతానికి మూడు కమిటీలను ప్రకటించిన బండి సంజయ్‌

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడు కమిటీలను ప్రకటించారు. నేతల చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు-తెరాస వైఫల్యాలపై అధ్యయన కమిటీ ...

Published : 05 Jul 2022 01:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడు కమిటీలను ప్రకటించారు. నేతల చేరికలపై సమన్వయ కమిటీ, ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు-తెరాస వైఫల్యాలపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. వీటిలో చేరికల సమన్వయ కన్వీనర్‌గా భాజపా జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమించారు. ఈ కమిటీలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఏ. చంద్రశేఖర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ఉన్నారు. ఫైనాన్స్‌ కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని ఎంపిక చేశారు. సభ్యులుగా గరికపాటి మోహన్‌రావు, చాడ సురేశ్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శాంతి కుమార్‌, యోగానంద్‌ ఉన్నారు. ప్రజా సమస్యలు, తెరాస వైఫల్యాలపై అధ్యయన కమిటీ కన్వీనర్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ప్రకటించారు. ఇందులో సభ్యులుగా వివేక్‌ వెంకటస్వామి, రఘునందన్‌రావు, స్వామిగౌడ్‌, డా.ప్రకాశ్‌రెడ్డి, బాజీ అజ్మీరా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని