Telangana News: అంబేడ్కర్‌ విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించాలి: బండి సంజయ్‌

అంబేడ్కర్‌ స్ఫూర్తిని భాజపా ముందుకు తీసుకెళ్తుందోని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దళిత వ్యక్తిని రాష్ట్రపతి చేసిన ఘనత భాజపాది అని చెప్పారు.

Updated : 14 Apr 2022 12:14 IST

హైదరాబాద్‌: అంబేడ్కర్‌ స్ఫూర్తిని భాజపా ముందుకు తీసుకెళ్తుందోని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దళిత వ్యక్తిని రాష్ట్రపతి చేసిన ఘనత భాజపాది అని చెప్పారు. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసిన గొప్పతనం భాజపాకే దక్కుతుందని బండి సంజయ్‌ అన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకల నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌, రఘునందన్‌రావు, లక్ష్మణ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. 

కాంగ్రెస్‌ పార్టీ అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిందని ఆరోపించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఏడేళ్లలో ఒక్కసారి కూడా నివాళులు అర్పించలేదని బండి సంజయ్‌ అన్నారు. అంతకముందు ఖైరతాబాద్ చౌరస్తాలోని మహావీర్ మఠ్ హనుమాన్ ఆలయాన్ని సంజయ్‌ దర్శించుకున్నారు. మరోవైపు అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ రెండో విడత పాదయాత్ర మొదలుకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని