భాజపా ఆందోళనలతోనే రిజర్వేషన్లు: బండి

భాజపా ఆందోళనల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేంద్రం

Published : 23 Jan 2021 01:38 IST

హైదరాబాద్: భాజపా ఆందోళనల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేంద్రం ఎప్పటి నుంచో అమలు చేస్తున్నా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లుగా వేలాది మంది అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కలేదని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘రెండేళ్లపాటు అన్యాయానికి గురి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రవర్ణ పేదలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇటీవల పార్టీ కార్యాలయంలో అగ్రవర్ణాల సభ్యులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి వ్యవహార శైలికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 27వ తేదీన 24 గంటల దీక్ష చేయాలని నిర్ణయించాం. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే నివేదిక తెప్పించుకొని రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ అమలు చేస్తామని ముందుకొచ్చారు. చాలా సంతోషం. కానీ, ఇన్నిరోజులు ఎందుకు గుర్తించలేదో సమాధానం చెప్పాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి..
నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts