
TS News: హామీ లేకుండానే భాజపాలోకి ఈటల: సంజయ్
హైదరాబాద్: అమర వీరుల ఆశయ సాధనకు విరుద్ధంగా తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలే లబ్ధి పొందాయని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఆరోపించారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించామని.. ఇప్పటికే తెరాసకు సంబంధించిన 18 మంది ముఖ్యనేతలపై న్యాయపరమైన సలహాలు తీసుకున్నామని బండి సంజయ్ చెప్పారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వారం రోజుల్లో భాజపాలో చేరే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల భాజపాలో చేరుతున్నట్లు ఆయన వివరించారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని పాలన నచ్చి ఈటల భాజపాలో చేరుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు భాజపాను మంచి వేదికగా భావిస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.