Telangana Formation Day: రాష్ట్ర ఏర్పాటులో భాజపా పాత్ర ప్రజలకు తెలుసు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాజపా ఎలాంటి ప్రధాన భూమిక పోషించిందో ప్రజలకు తెలుసని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాజపా ఎలాంటి ప్రధాన భూమిక పోషించిందో ప్రజలకు తెలుసని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంతో పాటు దిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఒక కుటుంబం, ఒక వ్యక్తి ద్వారా తెలంగాణ రాలేదని ప్రజలు గుర్తిస్తున్నారు. రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేసుకుంటున్న వేళ మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ యువకులకు ధైర్యం చెప్పారు. భాజపాలోని ప్రతి కార్యకర్త, అనుబంధ సంస్థలు, కార్యకర్తలు రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. దురదృష్టవశాత్తు భాజపాని గుర్తించకపోయినా.. పేరు కోసం పార్టీ ఎప్పుడూ పోరాటం చేయలేదు.
భాజపా మద్దతు లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదని ప్రజలు గుర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఒక కుటుంబం రాజ్యం ఏలుతోంది. ఆనాడు ఉద్యమం చేసిన ఉద్యమకారులు కనుమరుగైపోయారు. వారంతా భాజపాలో చేరుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెరాస పాలన చేస్తోంది. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ పాలన కోసం భాజపా యుద్ధం ప్రారంభించింది. మాతో అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా’’ అని బండి సంజయ్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఆ మార్క్ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు