Mamata Benarjee: బెంగాల్లోనూ అల్లర్లు సృష్టించాలని భాజపా యత్నిస్తోంది: మమత

మణిపూర్‌ (Manipur) తరహా అల్లర్లను పశ్చిమబెంగాల్‌లోనూ (West Bengal) సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 27 May 2023 23:58 IST

సల్‌బోని: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో (Manipur) ఇటీవల చోటు చేసుకున్న తరహా అల్లర్లను పశ్చిమబెంగాల్‌లోనూ సృష్టించేందుకు భాజపా (BJP) యత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benajree) ఆరోపించారు. రాష్ట్రమంత్రి బిర్బహా హన్సడా వాహనంపై కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడింది కుర్మీ వర్గానికి చెందిన వారు కాదని, దీని వెనుక భాజపా కార్యకర్తల హస్తం ఉందని ఆరోపించారు.

‘‘మణిపుర్‌లోఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక అల్లర్లలో భాజపా హస్తం ఉంది. అదే తరహాలో బెంగాల్‌లోనూ అల్లర్లు సృష్టించాలని కాషాయపార్టీ ప్రయత్నిస్తోంది. ఆదివాసీలు, కుర్మీలు ఘర్షణలకు దిగితే.. ఆర్మీని రంగంలోకి దించి కాల్పులు జరిపించాలని అనుకుంటోంది.’’ అని సల్‌బోనిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతాబెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లకు ఆజ్యం పోసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ అభిషేక్‌ బెనర్జీ కాన్వాయ్‌లోని రాష్ట్ర మంత్రి వాహనంపైకి శుక్రవారం కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అది దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ‘‘ మంత్రి వాహనం పై దాడిని నేను ఖండిస్తున్నా. కుర్మీవర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని నేను నమ్మడం లేదు. దీని వెనుక భాజపా కార్యకర్తల హస్తం ఉంది.’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని