Updated : 18 Mar 2021 12:22 IST

మా అభ్యర్థులకు ఓటేస్తే నాకు వేసినట్లే: మమత

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి భాజపాపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికల వేళ తనను బయటకు రాకుండా చేసేందుకు ఆ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇక్కడి జార్‌గ్రామ్‌ జిల్లా గోపీభల్లవపూర్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. గతంలో ఇదే తరహా భౌతిక దాడులకు సీపీఎం పాల్పడేదని, ఇప్పుడు భాజపా ఆ పనిచేస్తోందని మమత అన్నారు. 

ఎన్నికల వేళ బయటకు రాకుండా చేసేందుకు తన కాలికి గాయం చేశారే తప్ప.. తన గొంతు అణచలేకపోయారని మమత అన్నారు. భాజపాను తప్పకుండా ఓడించి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. బరిలో నిలిచిన తృణమూల్‌ అభ్యర్థుల్లో ఎవరికి ఓటేసినా అది తనకు వేసినట్లుగా భావించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎన్నికైన భాజపా అభ్యర్థి ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రేషన్‌ సరకులను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని