దీదీ కంటే ముందున్నాం: అమిత్‌షా

 పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించడం ఖాయమని హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 122 సీట్లతో అధికార తృణమూల్‌ కంటే ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బాంబులు, గన్‌ల సంస్కృతిని.. విశ్వాసం, అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చేస్తామని వాగ్దానం చేశారు. ‘‘ ప్రస్తుత ఎన్నికల్లో  భాజపా 122 స్థానాలు సాధించడం ...

Updated : 27 Feb 2024 18:38 IST

కోల్‌కతా:  పశ్చిమ్‌బెంగాల్‌ ఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. 122 సీట్లతో అధికార తృణమూల్‌ కంటే ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాంబులు, గన్‌ల సంస్కృతిని.. విశ్వాసం, అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చేస్తామని వాగ్దానం చేశారు. ‘‘ ప్రస్తుత ఎన్నికల్లో  భాజపా 122 స్థానాలు సాధించడం ఖాయం. అంతేకాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ కంటే ముందుంటాం’’ అని పుర్బ బర్దమాన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా అన్నారు.

పశ్చిమ్‌బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 దశలు పూర్తవ్వగా మరో మూడు విడతల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్‌, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరుపార్టీలు పోటాపోటీగా సభలు, బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నాయి.  మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. పోలింగ్‌ తేదీకి మూడు రోజుల ముందుగానే ప్రచారం నిలిపి వేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు సైతం వెనకాడబోమని ఈసీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని