Published : 31/05/2021 01:06 IST

ప్రజలతో భాజపా.. క్వారంటైన్‌లో ప్రతిపక్షాలు

కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన నడ్డా 

దిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండగా.. ప్రతిపక్ష నేతలు మాత్రం వర్చువల్‌ మీడియా సమావేశాల్లో కనిపిస్తున్నారంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘సేవా దివస్‌’ను పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాజపా నిమగ్నమైతే.. ప్రతిపక్ష పార్టీలన్నీ క్వారంటైన్‌కి వెళ్లిపోయాయని  ఎద్దేవా చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను మోదీ వ్యాక్సిన్‌గా పిలుస్తూ.. మహమ్మారిపై పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం ధైర్యాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. గతంలో వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం చేసినవారే నేడు వాటి కొరత గురించి గగ్గోలు పెడుతున్నారంటూ విమర్శించారు. టీకాలను ఉత్పత్తి చేసేందుకు 13 కంపెనీలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని పేర్కొన్నారు. త్వరలో మరో 19 కంపెనీలు కూడా టీకాలను ఉత్పత్తి చేస్తాయన్నారు. ప్రస్తుతం నెలకు 1.3 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ అక్టోబరు నుంచి నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటై ఏడేళ్లు పూర్తయిన సందర్బంగా సేవా దివస్‌ను జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాషాయ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కనీసం రెండు గ్రామాల్లోని ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్