HYD News: పబ్‌లో దొరికిన అందరినీ శిక్షించాలి... డీజీపీ కార్యాలయం వద్ద బీజేవైఎం ఆందోళన

బంజారాహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ ఘటనకు నిరసనగా భారతీయ జనతాపార్టీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు.

Updated : 03 Apr 2022 17:46 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ ఘటనకు నిరసనగా భారతీయ జనతాపార్టీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. బంజారాహిల్స్‌ పబ్‌లో దొరికిన అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పలుకుబడి ఉన్నవారి పేర్లను కేసు నుంచి తొలగిస్తున్నారని, ఎవరినీ వదలకుండా అందరినీ అరెస్టు చేయాలని కోరారు. డ్రగ్స్‌ కేసులో  రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన చేపట్టారు. డీజీపీ  కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని