Bommidi Nayakar: ఎవరా ఎమ్మెల్యే.. ఇలా వచ్చారేంటి!

నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ శుక్రవారం అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా కనిపించారు. సందర్శకులు, మీడియా ప్రతినిధులు అందరూ ఎవరా ఎమ్మెల్యే అంటూ ఆయన గురించి కనుక్కునే ప్రయత్నం చేశారు.

Updated : 22 Jun 2024 06:40 IST

మత్స్యకారుడి వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ 

ఈనాడు, అమరావతి: నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ శుక్రవారం అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా కనిపించారు. సందర్శకులు, మీడియా ప్రతినిధులు అందరూ ఎవరా ఎమ్మెల్యే అంటూ ఆయన గురించి కనుక్కునే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మత్స్యకారుడి వేషధారణలో వల, చేపల బుట్ట పట్టుకుని కూడలి నుంచి అసెంబ్లీ ప్రవేశద్వారం వరకు నడుచుకుంటూ వచ్చారు. ఆయన గురించి అందరూ ఆరా తీసి.. చివరకు అధికార కూటమి ఎమ్మెల్యే అని తెలియడంతో... ఆయన ఎందుకలా వచ్చారని కనుక్కునే ప్రయత్నం చేశారు. ‘రాష్ట్రంలో 970 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. కానీ, సంప్రదాయ మత్స్యకారుల జీవనం దుర్భరంగా ఉంది. వచ్చే ఐదేళ్లూ వారికి అండగా ఉంటామని చెప్పేందుకు ఇలా వచ్చా’ అని ఎమ్మెల్యే నాయకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని