AP News: జగన్‌ పాలన బాగోలేదని మూడేళ్ల తర్వాత భాజపాకు గుర్తొచ్చిందా?: బొత్స

రాష్ట్రంలో ఉనికిని కాపాడుకొనేందుకు భాజపా తాపత్రయపడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌ పరిపాలన బాగోలేదని

Updated : 28 Dec 2021 15:14 IST

విజయవాడ: రాష్ట్రంలో ఉనికిని కాపాడుకొనేందుకు భాజపా తాపత్రయపడుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌ పరిపాలన బాగోలేదని గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రత్యేకంగా సూచన చేస్తే స్వీకరిస్తాం తప్ప ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే ఎలా అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో నీతి అయోగ్‌ నివేదిక చూస్తే సరిపోతుందన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసుకోవాలంటూ చురకలంటించారు. అలాగే, విభజన హామీలు ఎంత వరకు కేంద్రం నెరవేర్చిందో భాజపా చూసుకోవాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని