Botsa: కన్నెర్ర చేస్తే చాలు.. యాత్రలు ఆగిపోతాయి: బొత్స

విశాఖపట్టణాన్ని రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబయిని తలదన్నే నగరమవుతుందని ఏపీ

Updated : 25 Sep 2022 16:32 IST

విశాఖపట్టణం: కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్నించారు. రూ.10వేల కోట్లు ఖర్చు పెడితే ముంబయిని తలదన్నే నగరంగా విశాఖను మార్చవచ్చన్నారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న భూముల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలకు ముడిపెట్టడం అనేది చాలా అన్యాయం.  ఒక ప్రాంతం.. కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదు. యాత్రలను అడ్డుకోవడం ఎంతసేపు.. ఐదు నిమిషాల పని. గట్టిగా కన్నెర్ర చేస్తే చాలు యాత్రలు ఆగిపోతాయి.. కానీ ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు, వాళ్లకు ఏమీ చేతకాదు అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడి ప్రజలు చేతులు ముడుచుకు కూర్చుంటే చాలా నష్టపోతారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలి. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలి’’ అని బొత్స వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని