BRS: తన మిత్రుడిని కాపాడేందుకు మోదీ సర్కార్‌ యత్నం: కేశవరావు

పార్లమెంట్‌ (Parliament)లో చర్చ జరిగితే అదానీ (Adani) షేర్లు మరింత పడిపోతాయని భాజపా ప్రభుత్వం భయపడుతోందని భారాస ఎంపీ కేశవరావు విమర్శించారు. వివిధ పోర్టులను టెండర్లు లేకుండా బెదిరింపులకు పాల్పడి అదానీకి అప్పగించారని ఆరోపించారు.

Published : 06 Feb 2023 19:19 IST

దిల్లీ: అదానీ (adani) సంస్థల వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరపకుండా.. తన మిత్రుడిని కాపాడేందుకు మోదీ (Modi) ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భారాస (BRS) రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఆరోపించారు. పార్లమెంట్‌లో చర్చ జరిగితే అదానీ షేర్లు మరింతగా పడిపోతాయని భాజపా (BJP) సర్కార్‌ భయపడుతోందని విమర్శించారు. ఎల్‌ఐసీ ద్వారా అదానీకి రూ.వేల కోట్ల మేలు చేశారన్నారు. ఏపీలోని కృష్ణపట్నం, గంగవరం, వైజాగ్‌లోని పోర్టులతోపాటు బాంబే ఎయిర్‌ పోర్టునూ టెండర్లు లేకుండా బెదిరింపులకు పాల్పడి అదానీకి కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. అతి తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడిగా అదానీ ఎలా అయ్యారో విచారణ జరిపించాలని కేకే డిమాండ్‌ చేశారు. మరోవైపు అదానీ సంస్థల షేర్లు పడిపోతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదని ఆర్థిక మంత్రి చెప్పడం దారుణమని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశ ప్రజల సంపద ఆవిరవుతుంటే ప్రధాని మౌనంగా ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని