CM KCR: కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాం: సీఎం కేసీఆర్
రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ వజ్రపు తునక.. ఇవాళ ఏపీ పరిస్థితి ఏంటి?
‘‘తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలి. తెలంగాణ మోడలే శరణ్యమని ఔరంగాబాద్‌లో ఒక ఐఏఎస్ అధికారే చెప్పారు. మనం చేసిన పనులను మనమే చెప్పుకోవటంలేదు. దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులందరూ భాగస్వామ్యం కావాలి. కులం, మతంపై ఏ పార్టీ గెలవదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నాం.. అదే భారాస విజయ రహస్యం. అంశాల వారీగా రాజకీయాలు చేయాలి.. కుత్సిత మనసుతో కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ఎక్కువశాతం సీట్లు. నేను చెప్పినట్టు చేస్తే 50వేల ఓట్ల మెజార్టీ గ్యారెంటీ.
తెలంగాణ వజ్రపు తునక.. ఇవాళ ఏపీ పరిస్థితి ఏంటి?సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటామంటే మోదీ ఇవ్వట్లేదు. గుజరాత్ మోడల్ బోగస్.. దేశం తెలంగాణ మోడల్ కోరుకుంటోంది. భారాసకు బాసులు, భగవద్గీత, వేదాలు.. అన్నీ తెలంగాణ ప్రజలే. కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రజలకు తెలియజేయాలి. పారదర్శక, అవినీతి రహిత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలి’’ అని పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్