BRS: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: భారాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

Published : 06 Feb 2023 15:46 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని భారాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని ఆయన ఆరోపించారు. విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. కేంద్రంలోని భాజపా సర్కారు తమను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.

కేసును సీబీఐ(CBI)కి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, భారాస ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని