Congress: భారాసకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 06 Jul 2024 15:02 IST

హైదరాబాద్‌: భారాసకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు ఆయన జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని